social
SCEU (CITU) రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ఆర్.జి-1 కార్యదర్శి మెండె శ్రీనివాస్ తో ముఖా ముఖి
Kalinga Times,Hyderabad : గతం నుండి సింగరేణిలోని సంఘాలన్నీ కార్మికులను తప్పుదోవపట్టిస్తూ..యాజమాన్యానికే లబ్దిని చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సి.ఐ.టి.యు) రాష్ట్ర ప్రచార కార్యదర్శి, మరియు ఆర్.జి-1 కార్యదర్శి మెండె శ్రీనివాస్ అన్నారు.తాను రాజకీయాల్లోకి రావడానికి గీట్ల ముకుందరెడ్డి కారణమన్నారు.యువకునిగా ఉన్నప్పటినుండే అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొని ప్రజాసేవలో మమేకమైనట్టు తెలిపారు.. స్వేచ్చాయుతమైన జాతీయ సంస్థ అయిన సి.ఐ.టి.యు లో చేరి పలు పోరాటాలతో కార్మికులకు సహాయాన్ని చేశానన్నారు.ఇక్కడున్న ఏ సంఘానికి కార్మిక సమస్యలపై పూరిగా అవగాహన లేదని ఎద్దేవా చేశారు..ఏ గుర్తింపు సంఘమైనా..ప్రాధాన్యత సంఘమైనా యాజమాన్యం తో లాలూచి పడో లేక,యాజమాన్య ఉచ్చులో పడో కార్మికులకు సమన్యాయం చేయలేక పోతున్నాయన్నారు.అందుకే రెండు ఓట్ల విధానంతో ఎన్నికలు జరపాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ఎప్పటినుండో డిమాండ్ చేస్తొందన్నారు.దాని వాల్ల యాజమాన్య ఆటలు సాగవని కార్మికులకు,సంఘాలకు సముచిత గౌరవం ఉంటుందని అభిప్రాయపడ్డారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నామన్నారు..కార్మికుల హక్కులను కాపాడటమే తమ హామీలని..అరచేతిలో వైకుంఠం చూపడం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ కు తెలియదంటున్న మెండె శ్రీనివాస్ తో ముఖా ముఖి