Telangana
లాభాల వాటాను 35 శాతం ప్రకటించాలని హె.చ్.ఎం.ఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్
Kalinga Times,Godavarikhani : లాక్ డౌన్ ఎత్తేసి కల్లు షాపులు కూడా తెరిచారు…కాని కరోనా బూచి చూపి సింగరేణిలో క్యాంటీన్లు తెరువకపోవటం సిగ్గుచేటని హె.చ్.ఎం.ఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు.బుధవారం గోదావరిఖనిలోని హెచ్.ఎం.ఎస్ కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సింగరేణి సి.అండ్.ఎం.డి పై మండిపడ్డారు.సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తొందని దీనికి చైర్మన్ మరియు గుర్తింపు,ప్రాధాన్యత సంఘాలు వంతపాడుయున్నాయని ఆరోపించారు.లాభాల వాటాను 35 శాతం ప్రకటించాలని ఆయన్ యాజ్మన్యాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్.జి.1 వైస్ ప్రసిడెంట్ తోట వేణు,నాయకులు ఉమా మహేష్ ,గౌహన్ బేగ్,రామస్వామి,కనకకయ్య,రాం మోహన్,ఎస్.కె.వల్లి తదితరులు పాల్గొన్నారు.