social
ఆన్ లైన్ క్లాస్ ల ద్వారా యువతకు ఉపాధికి అవకాశం కల్పిస్తున్న మంతెన శ్రీనివాస్
Kalinga Times, Godavarikhani : విద్యార్థులకు పాట్యాంశాల బోధన చేయడం వాటికి సంబందించిన అనుమానాలను నివృత్తి చేయడం వరకే చాలా మంది ఉపాధ్యాయులు పరిమితమవుతున్నారు…కాని కొంత మంది వారికి భిన్నంగా విద్యార్థుల భవితకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు దోహదపడతారు… ఆ కోవకు చెందిన వారిలో మంతెన శ్రీనివాస్ ఒకరు..గోదావరిఖని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మీడియట్ వొకేషనల్ ఎలక్రిటికల్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న మంతెన శ్రీనివాస్..వృత్తి విద్య ద్వారా అడ్మిషన పొందేవారంతా ఏదో ఓ పనిచేసుకుని బ్రతికేవారు కావడంతో సరిగా క్లాసులకు హాజరవ్వకపోవడంతో వారి స్థితి గతులను తెలుసుకుని వారిలో ఉన్న పట్టుదలను గమనించారు. ఆయన వారి కోసం అందరికి అర్థమయ్యేవిధంగా ఎలక్ట్రిషన్ కోర్సుకు సంబంధించిన సిలబస్ ను విభజించి 300 ల వీడియోలు రూపొందించి ఆన్ లైన్ లో తన ఐశ్వర్యం యూ ట్యూబ్ చానల్ లో పబ్లిష్ చేశారు.దీనితో వృత్తి విద్యకు సంబంధించి ఎలక్రిటికల్ కోర్సు పూర్తిగా మొట్ట తెలుగులో ఉండటం..మూలంగా చాలా మంది విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా నేర్చుకునే వెసులుబాటు కలిగింది..తెలుగు రాష్ట్రాలలో ఉన్న చాలా మంది విద్యార్థులకు మంతెన శ్రీనివాస్ మార్గదర్శకులుగా మారారు..ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సు సిలబస్ ను వీడియోల రూపంలో 300 వీడియోలుగా రూపొందించి ఆన్ లైన్ లో పొందుపరచినందుకు గాను ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంతెన శ్రీనివాస్ ను అభినందిస్తూ హైదరాబాదులో సన్మానము చేశారు. ఆన్ లైన్ ద్వారా ఎంతో మందిని సుశిక్తులను చేస్తున్న మంతెన శ్రీనివాస్తో కళింగ టైంస్..చిట్..చాట్