social
బతుకమ్మ వేడుకలు-2020
Kalinga Times, Godavarikhani : మన తెలంగాణలో పెత్ర అమావాస్య రోజునే ఎంగిలి పూల బతుకమ్మను నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోంది.. అయితె..ఈ సారి అధిక మాసం రావడంతో గౌరమ్మను పెట్టి బతుకమ్మ ఆడుకోవాలా వద్దా అనే విషయంలో కొంత సందిగ్దం నెలకొంది. కొంత మందిపురోహితులు చేసుకోవచ్చంటూ.మరికొందరు చేసుకోవద్దంటూ చెప్పారు.. అయితే మహిళలు మాత్రం భాద్ర పద మాసంలో వచ్చే అమావాస్యనే కాబట్టి..ఎంగిలి పూల బతుకమ్మ ను చేసుకున్నారు..గోదావరిఖని లోని లక్ష్మి నగర్ ప్రాంతంలో ఎంగిలి పూల బతుకమ్మను ఘనంగా నిర్వహించి కరోనా ను కడతేర్చమని మహిళలు గౌరమ్మను కోరుకున్నారు.