Telangana
కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండొద్దు-సీఎం కేసీఆర్

Kalinga Times , Hyderabad :వాతావరణం బాగా లేదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండొద్దన్నారు. ప్రజలు నీటి ప్రవాహానికి ఎదురెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని హితవుపలికారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపు గ్రామాలను గుర్తించాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. గోదావరికి వరద పెరిగితే భద్రాచలం పట్టణానికి ఇబ్బందులు వస్తాయని చెప్పారు. భద్రాచలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. శిబిరాల్లో భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ నుంచి రక్షణ కోసం మాస్కులు, శానిటైజర్లు అందించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయ చర్యలను పర్యవేక్షించాలని కేసీఆర్ ఆదేశించారు.