Telangana
ఇల్లు కూలిన భాదితురాలికి ఆపన్న హస్తం అందించిన సిపిఐ
Kalinga Times , Godavarikhani : కాజిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న మేకల రాజమ్మ అనే నిరుపేద మహిళ ఇల్లు కూలిపోయిన విషయం తెలిసి సిపిఐ రామగుండం నగర కార్యదర్శి కె. కనకరాజ్ సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ లు కాజిపల్లికి వెళ్ళి బియ్యం మరియు నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసలే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న మేకల రాజమ్మ వర్షం కారణంగా ఇల్లును కోల్పోవడం బాధాకరమని వారన్నారు. విపత్తు కింద పరిగణించి రెవిన్యూ అధికారులు వెంటనే ఇల్లును నిర్మించాలని, తక్షణం ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమం లో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు రేణికుంట్ల ప్రీతం తదితరులు పాల్గొన్నారు.