social
రాష్ట్రంలో సాధారణంకన్నా 31 శాతం అధికవర్షపాతం
Kalinga Times, Hyderabad : రాష్ట్రంలో గత నాలుగురోజులుగా కురుస్తున్న వానలతో గతేడాదితో పోల్చితే ఈసారి అత్యధిక వర్షపాతం నమోదయ్యిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ సీజన్లో ఇప్పటికే సాధారణంకన్నా 13 శాతం అధికవర్షపాతం నమోదయ్యిందని తెలిపింది. వనపర్తి జిల్లాలో 124 శాతం, గద్వాల జిల్లాలో 111 శాతం, వరంగల్ అర్బన్‌లో 108 శాతం అధిక వర్షపాతం నమోదయ్యిందని, నిర్మల్ జిల్లాలో 23 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యిందని వెల్లడించింది. నిన్నటివరకు సగటు వర్షపాతం సాధారణం కన్నా 31 శాతం అధికంగా నమోదయ్యిందని చెప్పింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనెల 19 ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. దీనిప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వానలు కురే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.