Telangana
అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న వ్యవస్థ తెలంగాణ పోలీస్
రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ
Kalinga Times, Godavarikhani : రామగుండం పోలీస్ కమిషనరేట్ సిఏఆర్ హెడ్ క్వార్టర్ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ ఐపీఎస్., జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశమంతటా ఈరోజు ఆనందంగా జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, మనం ఒక అందమైన ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో మంది త్యాగధనుల పుణ్యఫలం స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణత్యాగం వలన స్వాసంత్రం సిద్ధించిందని స్వాతంత్ర్య వచ్చిన స్వయం పాలనలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, మనము కూడా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ మన వంతు భాద్యతగా దేశసేవ కొరకు పాటుపడాలని, సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి కమీషనరేట్ పోలీస్ వ్యవస్థ కి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. పోలీసులు నిరంతరం శాంతిభద్రతలు కాపాడటంలో ఎంతో శ్రమించి ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడటం లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని, తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా పేరు పొందినదన్నారు. సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడుతున్నారని ముందు ముందు మరింత నీతి నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.
కరోనా వ్యాధి నివారణ గురించి అధికారులు సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తప్పకుండా శానిటైజర్, మాస్కులు, గ్లౌజులు వేసుకోవాలని బయట తిరిగే సమయంలో భౌతిక దూరం పాటించాలని, విధులు నిర్వహించడం ఎంత ముఖ్యమో, కరోనా వ్యాధి బారిన పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం అంతే ముఖ్యమని మనకు ఏమి కాదని నిర్లక్ష్యంగా ఉండవద్దని, ఏమో అయిపోతుందని భయపడవద్దని, మనోధైర్యంతో ముందుకు వెళ్లి కరోనాను జయించాలని సూచించారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిది పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలకు పోలీస్ అధికారులకు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.