social
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొన్న రష్యా
Kalinga Times, New Delhi : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు రష్యా వ్యాక్సిన్‌ను కనుగొందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్‌ను మొట్టమొదటగా తన కుమార్తెకే ఉపయోగించినట్లు పుతిన్ తెలిపారు. దేశ రాజధానిలోని మాస్కోలోని గమలేయ ఇన్స్టిట్యూట్ ఇది అభవృద్ధి చేసిందని అన్నారు. రెండు నెలలపాటు మనుషులపై ఈ వ్యాక్సిన్ పరీక్షలు జరుగుతున్నాయని పుతిన్ తెలిపారు.