National

కొవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

Kalinga Times, New Delhi : గుజరాత్‌లోని ఓ కొవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న 8మంది కరోనా రోగులు ఈ ప్రమాదంలో సజీవదహనమయ్యారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. అహ్మదాబాద్ నగరంలోని నవరంగపురా ప్రాంతంలోని శ్రేయా ఆసుపత్రిలోని 4వ అంతస్తులో ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళా రోగులున్నారు. శ్రేయా ఆసుపత్రిలో అగ్నిప్రమాదంతో అక్కడ చికిత్స పొందుతున్న 40 మంది ఇతర రోగులను ఎస్వీపీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం విజయ్ రూపానీతో పాటు అహ్మదాబాద్ మేయర్‌తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close