Andhra Pradesh
రేషన్ డీలర్ల మెరుపు సమ్మె
Kalinga Times, Amaravati : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రేషన్ డీలర్లు ఏపీలో రేషన్ డీలర్లు మెరుపు సమ్మెకు దిగారు.ప్రభుత్వం స్పందించే వరకూ పంపిణీని నిలిపివేస్తున్నట్లు డీలర్ల ప్రకటించారు. దీంతో రేషన్ షాపులకు వచ్చిన పేద ప్రజలు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సీఎం జగన్ స్పందించి న్యాయం చేసే వరకు రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నారు. కరోనా కష్ట కాలంలోనూ తాము పేదలకు రేషన్ పంపిణీ చేశామన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏడు విడతలుగా పంపిణీ చేస్తే రెండు విడతలు మాత్రమే కమిషన్ ఇచ్చారంటున్నారు డీలర్లు. ఒక్కో వితడతలో కోటిన్నర మంది చొప్పున నెలలో మూడు కోట్ల మందికి రేషన్ ఇచ్చామని గుర్తు చేశారు. కరోనా రక్షణ పరికరాలు ఇవ్వకున్నా బాధ్యతతో పని చేశామని, కరోనా వారియర్స్‌గా మమ్మల్ని గుర్తించి తమకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రేషన్ ఇచ్చే సమయంలో వేలి ముద్రల నిబంధన ఎత్తి వేయాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు. ఆరుగురు రేషన్ డీలర్లు కరోనాతో మరణిస్తే కనీసం ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.