Film
‘అలిమేలుమంగ వేంకటరమణ’లో కాజల్
Kalinga Times, Hyderabad : గోపీచంద్ హీరోగా డైరెక్టర్ తేజ ‘అలిమేలుమంగ వేంకటరమణ’ అనే సినిమాను నిర్మించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్ లేదా సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నారట. అయితే వీరిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాంతో మళ్లీ కాజల్ వైపే తేజ మొగ్గు చూపుతున్నారట. గోపీచంద్, కాజల్ ఇప్పటివరకు కలిసి నటించలేదు. దీంతో వీరి జంట తెరపై ఫ్రెష్‌గా ఉంటుందని తేజ భావిస్తున్నారట. పైగా, తాను పరిచయం చేసిన హీరోయిన్ కావడం కూడా కాజల్‌కు, తేజకు కలిసివచ్చే అవకాశంగా చెబుతున్నారు.