social
వర్షపు చినుకు పడితే చాలు రోడ్డుపై ఇంకుడు గుంతలే
Kalinga Times, Keesara : కీసర మండలం. రాంపల్లి రోడ్డు పరిస్థితి ఇది. వాహనదారుల రోడ్లపై వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాణ్యత లేని రోడ్లను వేసి కాంట్రాక్టర్ ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో తీసుకుంటున్నారు. అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని కాలనీవాసులు మండిపడుతున్నారు . వెహికల్స్ కు ఇన్సూరెన్స్ ఉండాలి.హెల్మెట్ ఉండాలి. అందులో ఏమాత్రం ఒక్కటి తక్కువున్న ప్రభుత్వానికి ఫైన్ కట్టవలసింది.అన్నీ బాగానే ఉన్నాయి. ఇబ్బందులకు గురవుతున్నా రోడ్డు పరిస్థితి మారేటట్టులేదు. చిన్న చినుకు పడితే చాలు రోడ్డుపై ఇంకుడు గుంతలే దర్శనమిస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి నాణ్యతలేని రోడ్లను వేస్తున్న అప్పుడే పరిశీలిస్తే బాగుంటుంది.