Telangana
కీసర మండలం యాద్గార్ పల్లి లో రైతు వేదిక భవనానికి భూమి పూజ
Kalinga Times,Keesara : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.కీసర మండలంలోని యాద్గార్ పల్లి లో బుధవారం రైతు వేదిక భవనానికి భూమి పూజ చేసిన అనంతరం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనతరం ఆయన మాట్లాడుతూ ఆరేళ్లలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా నిలిచిందన్నారు. తెలంగాణ రైతాంగం సత్తాను దేశానికి చాటింది.రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకే ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసి మరింత చేయూతనిస్తోంది.రైతులకు పుష్కలంగా నీళ్లు, రైతుబంధు సాయం, గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతుంది. తెలంగాణ రాష్ట్రం లో సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర సంస్కరణలు వ్యవసాయానికి ఊతమిచ్చాయి. రైతులంతా ఒకచోట చేరి వ్యవసాయంపై చర్చించుకునేందుకే ఈ రైతు వేదిక అన్నారు. రైతులు సమావేశాలు. నిర్వహించుకొనేందుకు, ఇతర అవసరాలకు అనుగుణంగా 2,046 చదరపు అడుగుల్లో రైతు వేదిక నిర్మాణం చేపట్టాం.రైతు వేదికల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడంతోపాటు ఇంటర్‌నెట్ సౌకర్యం కోసం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలు.సీఎం కేసీఆర్ నేరుగా ఏ రైతుతోనైనా మాట్లాడే వెసులుబాటు.రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుగా ఉంటుంది. రైతు వేదికలను కేవలం సమావేశాలకే పరిమితం చేయకుండా అన్నదాతలకు అన్నివిధాలుగా ఉపయోగపడేలా అవసరమైతే గోదాంలుగా కూడా ఉపయోగించుకొనే వెసులుబాటు ఎరువులు, విత్తనాలు, పరికరాలు వచ్చినప్పుడు వాటిని తాత్కాలికంగా భద్రపరిచేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,జెడ్పి చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి,రైతు బంధు అధ్యక్షుడు నందా రెడ్డి ,జెడ్పి వైస్ చైర్మన్ వెంకటేష్,ఇంచార్జ్ జహంగీర్,ఎంపిపి ఇందిరా లక్ష్మి నారాయణ ,సర్పంచులు,వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.