Film
నాగ్అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ డబల్ రోల్
Kalinga Times, Hyderabad : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్అశ్విన్ డైరెక్షన్లో చేయనున్న అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కథ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. నాగ్ అశ్విన్ ఓ పురాణ కథలోని పాత్రల ఆధారంగా నేటి సమాజానికి తగ్గట్లు కథ రాసుకున్నాడని ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. ఇక నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్‌ను తీసుకోవాలని చూస్తున్నాడట. ఇప్పటికే కొంతమందితో ఫోన్లోనే సంప్రదించినట్లు తెలిసింది.ఇక తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు నాగ్ అశ్విన్. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించనున్నారు.