National
తెలంగాణాలో ఉచితంగా కరోనా వైద్యం
Kalinga Times, Hyderabad : రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ ఉచితంగా కరోనా వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, ఫ్రీగా చికిత్స అందివ్వనున్నారు.
మొదటిగా మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో
కామినేని, మమత, మల్లారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత కరోనా చికిత్స చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో 37,745 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు 24,840 మంది కరోనా నుంచి కోలుకోగా, 12,531 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 375 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.