Andhra Pradesh
తిరుపతిలోని 18 డివిజన్లలో నేటి నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్
Kalinga Times, Tirupati : చిత్తూరు జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా తిరుపతిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.నగరంలోనే ఏకంగా వెయ్యికిపైగా కేసులు ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. 20కన్నా ఎక్కువగా కేసులు ఉన్న 18 డివిజన్లలో నేటి నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ను అమలు చేయనున్నారు. ఆ డివిజన్లు (1, 4, 5, 6, 7, 9, 10, 13, 14, 15, 28, 29,30,31,35, 36, 37, 38)గా ఉన్నాయి. ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. అత్యవసరమైన, మెడికల్ ఎమర్జెన్సీ, మద్యం షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. నగరంలోని మిగిలిన డివిజన్లలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే దుకాణాలు తెరవొచ్చు.
సమీపంలో ఉన్న పంచాయతీల్లోనూ చర్యలు
మొదటి విడతగా తిరుపతి గ్రామీణ మండలంలో 20 కంటే ఎక్కువ కేసులు నమోదైన అవిలాల, తిరుచానూరు, పద్మావతిపురం, శెట్టిపల్లి పంచాయతీలను గుర్తించి నేటి నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్నారు.