Kalinga Times, Hyderabad : పేదలకు ప్రభుత్వ హాస్పిటళ్లు ఆశాదీపంగా నిలుస్తున్నాయని ఆమె , ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్స బాగుందని, పరిశుభ్రతను పెంపొందించారని గవర్నర్ తమిళిసై ట్వీట్లు చేశారు.. సర్కారీ దావఖానాల్లో చికిత్స చేయించుకునేలా ప్రజలకు భరోసానిస్తాయన్నారు.జిల్లా హాస్పిటళ్లు, టిమ్స్, ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా చికిత్స అందిస్తున్నారని గవర్నర్ తెలిపారు. ర్యాపిడ్ టెస్టులను పెంచామని.. 98 డయాగ్నొస్టిక్ ల్యాబుల్లో టెస్టులు చేస్తున్నారని గవర్నర్ ట్వీట్ చేశారు. హాస్పిటళ్లలో బెడ్ల ఖాళీల వివరాలను డ్యాష్ బోర్డులో పొందుపరుస్తున్నారని.. హోం క్వారంటైన్లో ఉంటున్న వారికి కాల్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గవర్నర్ తెలిపారు.
#COVID19 *District hospitals&TIMS
& Pvt medical colleges 2 provide Covid treatment *Rapid tests widened &98diagnostic labs.*Dash board in hospitals for bed status.Home quarantine Call centres.Telengana moving towards some of the expected developments 4 the benefit of people (2)— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) July 15, 2020