Telangana
టి.ఆర్.ఎస్ లో చేరిక
Kalinga Times,Ghatkesar,Medchal: ముఖ్యమంత్రి కే.సి.ఆర్ చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరుతున్నారని, అభివృద్ధి టి.ఆర్.ఎస్ తో నే సాధ్యం అని నిర్ణయించుకొని పార్టీ లో చేరి పార్టీ ని బలపరుస్తున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.ఘట్కేసర్ మున్సిపాలిటీ కి చెందిన స్వతంత్రంగా గెలుపొందిన కౌన్సిలర్లు నరేష్, నాగజ్యోతి,మల్లేష్,నర్సింగ్ రావు లు మంగళవారం టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు.కండువా కప్పి టి.ఆర్.ఎస్ పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పార్టీ ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తూప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి ,జహంగీర్ ,చైర్మన్ పావని. తదితరులు పాల్గొన్నారు.