National
దేశవ్యాప్త లాక్ డౌన్‌ను జూన్ 30 వరకూ పొడిగింపు
Kalinga Times,Hyderabad : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్‌ను జూన్ 30 వరకూ పొడిగించింది. దీన్ని కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేసిన ప్రభుత్వం.. సాధారణ ప్రాంతాల వారికి భారీగా సడలింపులను ఇచ్చింది. ఈ సడలింపులు దేశంలో ఉన్న కంటైన్మెంట్ జోన్లకు ఏ మాత్రం వర్తించబోవని స్పష్టం చేసింది. జూన్ నెల మొత్తానికి ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంటూ శనివారం కేంద్ర హోంమంత్రిత్వశాఖ వివరించింది. ప్రస్తుత దశను అన్‌లాక్ 1గా పేర్కొంటూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
అన్‌లాక్ 1, ఫేజ్-1లోని సడలింపులు..
కొత్త మార్గదర్శకాల ప్రకారం రాత్రిపూట కర్ఫ్యూను కాస్త సడలించారు. ఇక నుంచి రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 వరకూ కర్ఫ్యూ ఉండనుంది.
జూన్ 8 నుంచి దేవాలయాలు, మసీదులు, మాల్స్, రెస్టారెంట్లను, హోటళ్లు తెరుచుకొనేందుకు అనుమతించారు.
ప్రస్తుతానికి అనుమతి లేనివి
ఫేజ్-2లోని సడలింపులు..
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విద్యాసంస్థల యాజమాన్యాలతో సంప్రదింపుల అనంతరం వాటిని పున:ప్రారంభించడంపై నిర్ణయాన్ని జులైలో ప్రకటిస్తారు. అన్ని విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలు, కాలేజీలన్నీ ఈ కోవలోకే వస్తాయి.
వీటి ప్రారంభానికి సంబంధించిన ఎస్ఓపీని కేంద్ర మంత్రిత్వశాఖలు, ఇతర నిపుణులను సంప్రదించి ఆరోగ్య శాఖ రూపొందించనుంది.
ఫేజ్-3లోని సడలింపులు..
అప్పటి పరిస్థితులను బట్టి అంతర్జాతీయ విమానసర్వీసులు, మెట్రో రైలు సర్వీసులు, సినిమా హాళ్లు, జిమ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియాలు, అసెంబ్లీ వంటి వాటికి అనుమతిస్తారు.