Telangana
సిఎం కెసిఆర్ ప్రె స్ మీట్ అంటే… విపరీతమైన ఆసక్తి
Kalinga Times , Hyderabad : రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కరోనా సందర్బంగా నిర్వహించే విలేకరుల సమావేశాలకు డిజిటల్, చానళ్లలో ఆదరణ అనూహ్యంగా పెరుగుతోంది. ఇది సమావేశానికి, మరో సమావేశానికి వీక్షకుల సంఖ్య పె రగడమే తప్ప తగ్గడం లేదు. దీంతో ఆయన పాపులారిటీలో రేటింగ్ కింగ్ లాగా మారారు. సిఎం కెసిఆర్ ప్రె స్ మీట్ అంటే రాష్ట్రంలోనే కాక దేశంలో, ప్రపంచంలో విపరీతమైన ఆసక్తి నెలకొంటోంది. ఇటీవల రెండు రోజుల క్రితం ఆయన నిర్వహించినా విలేకరుల సమావేశాన్ని లైవ్‌లో పది లక్షల మంది వీక్షించడం రికార్డుగా చెబుతున్నారు. ఆ సమావేశం రెండు గంటలకు పైగా కొనసాగినా,ప్రపంచ వ్యాప్తంగా ఆయన చెప్పే విషయాలను చివరి దాకా అంతా వీక్షించారు. ఆ తర్వాత యూట్యూబ్‌లలో, ప్రధాన న్యూస్ చానళ్లుగా ఉన్నటివి 9, వి 6, టి న్యూస్, ఈ టివి తెలంగాణ, ఎన్ టివి, టివి 5, యూట్యూబ్‌లో ఆ చానళ్లు ప్రసారం చేసిన లైవ్‌ను గడిచిన రెండు రోజులుగా యాభై లక్షలకు పైగా వీక్షించినట్లు ట్రెండింగ్ నిరూపిస్తుంది.ఇవి గాక యూట్యూబ్‌లలో, యోయో, ఓం ఫట్‌తో పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్ కెటిఆర్, కవిత, హారిష్‌రావు, సంతోష్‌కుమార్ ఫేస్‌బుక్ ఖాతా లైవ్‌లను దేశ విదేశాల్లోని వారి వీక్షించినట్లుగా రికార్డులు నమోదయ్యాయి.