National
మన దేశంలో 11 రోజుల్లోనే కరోనావైరస్ కేసులు రెట్టింపు
Kalinga Times ,News Delhi : మన దేశంలో గత కొన్ని రోజులుగా కోవిడ్ -19 కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ సభ్యులు షమికా రవి తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో కరోనా వృద్ధి రేటు ఇప్పుడు 6.6 శాతంగా ఉంది. మే 2 న ఈ వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యింది. గతంలో కరోనా కేసులు 15 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. అయితే ఇప్పుడు 11 రోజుల్లోనే కరోనావైరస్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయంగా పరిణమించింది. దేశంలో కరోనా కేసులు ఉన్నట్టుండి మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడులో పెరిగాయని షమికా రవి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కరోనా మరణాలు కూడా పెరిగాయన్నారు.