Telangana
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
Kalinga Times , Siddipet : సిద్దిపెట జిల్లాలోని వర్గల్ మండలం తునికికల్సా గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు షేర్‌పల్లి గ్రామానికి చెందిన గడ్డం బీరప్పగా స్థానికులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.