Kalinga Times, Hyderabad : కరోనా వైరస్ పూర్తిగా నశించకుండానే తెలంగాణలో మద్యం దుకాణాలను తెరవడం తనకు ఇష్టం లేకపోయినా తప్పలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చిన సడలింపుల మేరకు తెలంగాణ పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మద్యం షాపులను తెరిచారని కేసీఆర్ తెలిపారు. పొరుగున ఉన్న ఈ రాష్ట్రాల నుంచి లిక్కర్ స్మగ్లింగ్ పెరిగిపోవడం, సరిహద్దు గ్రామాల ప్రజలు మద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లొచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ధరలను భారీగా పెంచాలని ప్రతిపాదనలు వచ్చినా ఇతర రాష్ట్రాల మాదిరిగా తాము 50 శాతం, 75 శాతం వరకు పెంచాలని భావించలేదన్నారు. పేదలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ ధరలను 11 శాతం , మిగతా బ్రాండ్లపై 16 శాతం వరకూ ధరలను పెంచింది. లాక్‌డౌన్ తొలగించిన తర్వాత.. పెంచిన మద్యం ధరలను తగ్గించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ధరల పెంపుపై అన్ని వర్గాలతో సమీక్షించామన్నారు.
పెంచిన ధరల ప్రకారం..
90 రూపాయలు ఉన్న క్వార్టర్ లిక్కర్ బాటిల్ రూ.100 కానుండగా, రూ.130 ఉండే బాటిల్ ధర రూ.150కి పెరగనుంది. పక్కన ఉన్న ఏపీలో మద్యం ధరలు 75 శాతం పెరగ్గా… తెలంగాణలో 16 శాతం మాత్రమే పెరగడం మందు బాబులకు ఊరటనిచ్చే అంశంగా భావించొచ్చు.