Telangana
బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఆత్మహత్య
Kalinga Times, Hyderabad : నగరంలోని ఉప్పల్‌లో దారుణం జరిగింది. పీఎస్ పరిధి సౌత్ స్వరూప్ నగర్‌లో బాల సుందరం(38) అనే ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. బాల సుందరం ఉప్పల్‌లోని సౌత్ స్వరూప్ నగర్‌లో నివాసముంటూ కింగ్ కోటి ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆత్మహత్యకు ముందు తన చావుకు ఎవరు కారణం కాదని నోట్ రాసి చనిపోయాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.