social

ఎండాకాలం నీరసం దరిచేరనీయని జావ…

Kalinga Times, Hyderabad : జావ అంటే ఏదో కొంచెం నీళ్లలో రాగిపిండి వేసుకుని తీసుకోవడం కాదు. బియ్యం, పెసలు, రాగులు, గోధుమలు, బార్లీ, సోయాగింజలు వీటన్నింటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో ఒకటికి నాలుగువంతుల నీళ్లు పోసి పదినిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపి దించేయాలి. ఇందులో ఉడికించిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు.కావాలనుకుంటే కాస్త నెయ్యి కూడా కలుపుకోవచ్చు. ఈ జావలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది చలువ చేస్తుంది. త్వరగా జీర్ణమవుతుంది. దీని ద్వారా తక్షణ శక్తి అందుతుంది.ఇది ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గిస్తుంది. దీంట్లో ఆమైనో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఉండే ట్రిప్టోపెన్‌ వల్ల కడుపు నించిన భావన కలుగుతుంది.ఈ జావలో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, విటమిన్‌ బి, పీచు, మాంసకృత్తులు ఉంటాయి. 25 గ్రాముల పొడితో తయారుచేసిన జావను తీసుకున్నా కావాల్సిన శక్తి అందుతుంది. రెండు గంటపాలు ఆకలి వేయదు. డైటింగ్‌లో భాగంగా రాత్రిపూట దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారు. ఈ జావ త్వరగా జీర్ణమవుతుంది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి మంచి ఆహారం. అన్ని వయసుల వాల్లు, మధుమేహ బాధితులు దీన్ని తీసుకోవచ్చు. జావ కాస్త కారంగా ఉండాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. చిరుధాన్యాలతో చేసే జావ  సులువుగా జీర్ణమవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కావాల్సిన పోషకాలు అందిస్తుంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close