Telangana
కార్మికుల హక్కుల పరిరక్షణకై ఉద్యమాలు ఉదృతం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్
Kalinga Times, Hyderabad : సుదీర్ఘకాలం అనేక పోరాటలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులు కాలరాయబడుతున్నయని కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు ఉదృతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్ పేర్కొన్నారు. శుక్రవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జవహర్ నగర్ పరిధిలో అనేక చోట్ల మే డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఎర్ర జెండాను ఎన్.బాలమల్లేష్ ఎగురవేసారు. ఈ సందర్భంగా బాలమల్లేష్ ప్రసంగిస్తుా కార్మిక వర్గాలు అనేక విరోచిత పోరాటలు చేసి కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది.పోరాటల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కాలరాస్తున్నాయని విమర్శించారు.కార్మికులకు సంక్షేమ చట్టాలను అమలుపర్చడంలో ప్రభుత్వలు విఫలమైతున్నయని దుయ్యబట్టారు.
మోది ప్రభుత్వం పెట్టుబడిదారులు బ్యాంకులో తీసుకొన్న రుణాలను ఎగ్గోడుతున్న పట్టించుకోవడం లేదన్నారు.ఇటీవల నీరవ్ మోది,విజయ్ మాల్యా తదితర కార్పొరేట్ కంపెనీలకు 64 వేల కోట్లకు పైగా రుణాలు రద్దు చేయడం కార్పోరెట్లకు అనుకులంగా వ్యవహరించడం అద్దం పడుతుందని అన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి హెచ్ దశరథ్ ,టి శంకర్* మాట్లాడుతు కరోనా లాక్ డౌన్ వల్ల వలసకులీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు..ఈ కార్యక్రమంలో కాప్రా మండల కార్యదర్శి *నిమ్మల నర్సింహులు* సహాయ కార్యదర్శి *జంగిడి శ్రీనివాస్* తెలంగాణా ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి *వి.వెంకటచారి* జవహర్ నగర్ కార్యదర్శి *దర్శనం యాదగిరి* AITUC నాయకులు *ఎల్లయ్య* సత్యనారాయణ శాఖ కార్యదర్శులు రాజేశ్వరి,ప్రవీణ్ బాలక్రిష్ణ,సురేష్,బాబ్లు,కే రవి, కుమార్,మెహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు జవహర్ నగర్ లోని సీపీఐ కాలనీ,,ఫైరింగ్ కట్ట,,కోళ్ళఫాం బస్టాప్,,శివాజీనగర్,,చంద్రపురి కాలనీ,,గిరి ప్రసాద్ నగర్,,సాయిబాబా కమాన్ తదితర ప్రాంతాలలో సీపీఐ జెండాలను ఎగురవేసారు