Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24గంటల్లో 60మందికి పాజిటివ్
Kalinga Times, Hyderabad : ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 7,092 శాంపిళ్లకు పరీక్షలు చేయగా… 60మందికి పాజిటివ్ వచ్చిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో 1,027 చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా అనంతపురం-6, గుంటూరు-19, కడప-6, కర్నూలు-25, విశాఖపట్నం -2, పశ్చిమ గోదావరి -2 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఎపి కరోనా పాజిటివ్ కేసులు 1,463కు చేరుకున్నాయి. కోవిడ్ తో కర్నూలులో ఒకరు, నెల్లూరులో మరొకరు మృతి చెందారు. ప్రస్తుతం ఎపిలో కరోనా మృతుల సంఖ్య 33 చేరింది.ఇప్పటి వరకు ఈ వైరస్ తో కోలుకుని 403మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గడం లేదు. కర్నూలులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరింది.