National
యూకే ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో తొలి డోస్ కరోనా టీకా
వాక్సిన్ విజయవంతం అయితే, సెప్టెంబర్ నాటికి...
Kalinga Times Desk, Hyderabad : కరోనా మహమ్మారికి వాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచదేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే జర్మనీ, చైనా, ఆస్ట్రేలియా, యూఎస్ తదితర దేశాల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ మొదలు కాగా తాజాగా యూకే మరో ముందడుగు వేసింది. యూకే ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో వాక్సిన్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. అయితే ఈవాక్సిన్‌ను నేడు యూకేలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎంపిక చేసిన వారిపై తొలి డోస్ కరోనా టీకాను ఇవ్వనున్నారు. ఈ ట్రయల్స్ లో 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న 510 మంది వాలంటీర్లు పాల్గొననున్నారు.ఈ వాక్సిన్ విజయవంతం అయితే, సెప్టెంబర్ నాటికి మిలియన్ డోస్ లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ వెల్లడించారు. కాగా ఈ వాక్సిన్ విజయవంతం అయ్యే అవకాశాలు 80 శాతం వరకూ ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పరీక్షల్లో వాక్సిన్ సక్సెస్ సాధిస్తే, సాధ్యమైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు.