National
తొలిసారిగా ప్రధాని ముఖానికి మాస్క్
భారత్‌లో వైరస్ వ్యాప్తి ఎక్కువైందన్న సంకేతాలు ఇచ్చిన మోది
Kalinga Times , Hyderabad : కేంద్రం విధించిన లాక్ డౌన్ మరో మూడు రోజుల్లో ముగుస్తుండటంతో … ప్రధాని మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశమయ్యారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య అమాంతం పెరిగింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడువేలు దాటింది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. దీంతో ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగించాలంటూ కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. దీంతో లాక్ డౌన్ పొడిగింపుపై ఈ సమావేశంలో ప్రధాని చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అయితే ఈ సారి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని ముఖానికి మాస్క్‌తో కనిపించారు. తొలిసారిగా ఆయన ముఖం చుట్టూ తెల్లటి వస్త్రాన్ని కట్టుకున్నారు. ఆయనతో పాటు… వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎంలు కూడా మాస్కులు ధరించారు. కరోనా వచ్చిన తర్వాత ప్రధాని ఏ సమావేశంలో కూడా ఇలా కనిపించలేదు. కేంద్ర కేబినెట్ భేటీను కూడా ఆయన ముఖానికి మాస్క్ లేకుండానే నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన సమీక్షా సమావేశాల్లో ప్రధాని సామాజిక దూరం పాటించారు కానీ ఏ సందర్భంలో కూడా మాస్క్ మాత్రం ధరించలేదు. ఇప్పుడు ప్రధాని మోదీ ఇలా మాస్క్ ధరించి కనపించడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు భారత్‌లో వైరస్ వ్యాప్తి ఎక్కువైందన్న సంకేతాలు కూడా మోదీ ఈ సందర్భంగా మనకు చెప్పారని నెటిజన్స్ అంతా చర్చించుకుంటున్నారు.