Telangana
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకొంటాం
KalingaTimes, Siddipet : సిద్దిపేట జిల్లాలో ని కొండపాక మండలం లోని అంకిరెడ్డిపల్లి, దర్గా, బందారం గ్రామాలలో నిన్న సాయంత్రం కురిసిన రాళ్ల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన వరి పంటలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు శుక్రవారం పరిశీలించారు దర్గా గ్రామంలో తెలు మహేష్ కి చెందిన రెండెకరాల వరి పంట లో కురిసిన వడగండ్ల వర్షానికి పూర్తిగా నష్టపోయాడు మంత్రి ముందు నష్టపోయిన రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు నేనూ వేసిన రెండెకరాల వరి పంట వేసాను పూర్తిగా నష్టపోయాను, నా కుటుంబం అప్పులో ఉంది నాకూ ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి కాళ్ళ మీద పడి రోదించాడు అదేవిధంగా పలు గ్రామాల్లో నష్టపోయిన వరి పంటను మంత్రి పరిశీలించారు
వర్షం కారణంగా నష్ట పోయిన వరి, మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది అని రైతులకు భరోసాను ఇచ్చారు వడగండ్ల బాధిత గ్రామాల్లో వరి గణన చేసి తెలియజేయాలని అదనపు కలెక్టర్ పద్మాకర్ ను ఆదేశించాడు వ్యవసాయ శాఖ అధికారులు ఇక్కడే ఉండి ప్రతీ రైతు యొక్క వరి పంటను పరిచిలించి నష్టాన్ని తెలియపరచాలని అధికారులను ఆదేశించాడు ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పద్మాకర్, FDC చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మెన్ చిట్టి దేవేందర్ రెడ్డి, రైతు సమితి సభ్యులు నాగిరెడ్డి, దేవీ రవీందర్, వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, ఎంపీపీ సుగుణ దుర్గయ్య, తహసీల్దార్, స్థానిక సర్పంచులు శ్రీనివాస్, నర్సిoములు, రజిత, రైతు సమితి నాయకులు యాదం రావు, TRS నాయకులు పాల్గొన్నారు