Film
ఇంట్లో ఉంటూనే ,అందరూ ఇంట్లో ఉండాలని కోరుతూ.. షార్ట్ ఫిలిం
Kalinga Times, Hyderabad : సామాజిక దూరం పాటించాలని వీలైనంతగా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, గవర్నమెంట్ అధికారులే కాదు సినీ ప్రముఖులు కూడా కోరుతున్నారు. ఇంట్లో ఉంటూనే ,అందరూ ఇంట్లో ఉండాలని కోరుతూ.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, ప్రియాంకా చోప్రా తదితర స్టార్లంతా కలిసి ఓ షార్ట్ ఫిలిం చేశారు. ‘ది ఫామిలీ’ అనే ఈ షార్ట్ ఫిలింను సోనీ టీవీ.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దీనిలో మరో విశేషమేంటంటే.. ఈ షార్ట్ ఫిలింలో నటించిన ఏ ఒక్క యాక్టర్ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఇళ్లలో నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయకుండా తమ పాత్రలో నటించి చిత్రాన్ని పూర్తిచేశారు.
Presenting ‘Family’, a made-at-home short film featuring @SrBachchan, #Rajnikanth #RanbirKapoor @priyankachopra @aliaa08, #Chiranjeevi @Mohanlal, #Mammootty, @meSonalee @prosenjitbumba #ShivaRajkumar & @diljitdosanjh.
Supported by #SonyPicturesNetworksIndia & #KalyanJewellers. pic.twitter.com/menuDz808H— sonytv (@SonyTV) April 6, 2020