Telangana
సామూహిక మరణాల వల్ల తలెత్తే విషాదాన్ని దేశం భరించలేదు
మోదీ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్ కొనసాగించాలని చెప్పా...
Kalinga Times, Hyderabad : నిజాముద్దీన్ ఘటన లేకపోతే పరిస్థితి బ్రహ్మాండంగా ఉండేదన్న కేసీఆర్.. లింక్ కట్ చేయడం కోసం లాక్‌డౌన్‌ను పొడిగించాలన్నారు. ఇదే సమాజానికి మంచిదన్న తెలంగాణ సీఎం… మోదీ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్‌డౌన్ కొనసాగించాలని చెప్పానని తెలిపారు. రాష్ట్రాల స్థితిగతులను తదుపరి దశలో ప్రధాని తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. లాక్‌డౌన్ వల్ల తెలంగాణ ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ.. బతకాలంటే తప్పదన్నారు.‘‘చనిపోయిన వాళ్లను వెనక్కి తీసుకు రాలేం. యుద్ధం వల్ల ఎంతో మంది అనాథలు అవుతారు. విషాదాన్ని అరికట్టలేం. ఇలాంటి సామూహిక మరణాల వల్ల తలెత్తే విషాదాన్ని కూడా దేశం భరించలేదు. వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతే ఏమాత్రం తట్టుకోలేం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
CM Sri K. Chandrashekar Rao addressing the Media on Lockdown situation in Telangana from Pragathi Bhavan.
Telangana CMO ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಸೋಮವಾರ, ಏಪ್ರಿಲ್ 6, 2020