Andhra Pradesh
ఆందోళన వద్దు. ముందు జాగ్రత్తలతోనే వైరస్ సోకకుండా చూసుకోవచ్చు
‘నో టూ ప్యానిక్... ఎస్ టూ ప్రికాషన్స్’ అన్నది నినాదం
Kalinga Times, Amaravati : ‘కరోనా వల్ల మనుషులు పిట్టల్లా చనిపోతారన్న భయం నిజం కా దు. ఈ విషయంలో ఆందోళన వద్దు. ముందు జాగ్రత్తలతోనే వైరస్ సోకకుండా చూసుకోవచ్చు. ‘నో టూ ప్యానిక్… ఎస్ టూ ప్రికాషన్స్’ అన్నది నినాదం కావా లి. ప్రజల్లో అవగాహన పెంచితే అపోహలను తొలగించవచ్చు’ అని సీఎం జగన్ సూచించారు. శుక్రవా రం జిల్లా కలెక్టర్లతో కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ, తమకు తెలియ ని సమాచారం ఇచ్చినా, కావాలని తప్పుడు సమాచా రం ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురిచేసినా గట్టి చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాలు అందుబాటు లో ఉంటాయని, వాటిని మూసివేయబోమన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిత్యావసరాల ధరలపై పర్యవేక్షణ చేయాలన్నారు. దేశం మొత్తంమీద ఇప్పటి వరకూ 191 కేసులు నమోదైతే, రాష్ట్రంలో 3 మాత్రమే నమోదయ్యాయన్నారు. ఈ బా ధితులు ఇటలీ, యూకే, సౌదీ నుంచి వచ్చారని చె ప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 80.9శాతం మందికి ఇళ్లలోనే ఉంటూ, వైద్యం తీసుకోవడం ద్వారా నయమైందన్నారు. 13.8శాతం మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని, 4.7శాతం కేసులు మాత్రమే ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. మీరు చేపడుతున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయంటూ కలెక్టర్లు, అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగు లు, ఆశా వర్కర్లు, వలంటీర్లను సీఎం ప్రశంసించారు.