
Kalinga Times, Hyderabad : ఆదివారంనాడు ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని తెలంగాణ గవర్నర్ తమిళసై విజ్ఞప్తి చేశారు. గవర్నర్ తెలుగులో మాట్లాడుతూ కరోనా జాగ్రత్తలను చెప్పారు. కరోనాపై భయాందోళనలు వద్దని ఆమె అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందన్నారు. తరచూ చేతులు కడుక్కోవాలని, శానిటైజర్లు వాడాలని ఆమె సూచించారు. ప్రజలందరినీ రక్షించడమే ధ్యేయమని ఆమె అన్నారు. విదేశాలనుంచి వచ్చే వారు క్వారంటైన్‌లో ఉండాలని ఆమె సూచించారు.