social
తెలంగాణలో కరోనా వైరస్‌పై వదంతులు నమ్మకండి
Kalinga Times, Hyderabad : తెలంగాణలో కరోనా వైరస్‌పై వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం మంత్రి మీడియతో మాట్లాడుతూ కరోనా వైరస్ తెలంగాణలో ఉన్నట్లు ఇంకా ఎలాంటి నిర్థారణ కాలేదన్నారు. ఆరోగ్య శాఖ అన్ని విషయాలు పర్యవేక్షిస్తోందన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.