Telangana
కొంపముంచిన సర్వే… స్వామి భక్తికి ..సీటు కోల్పొతున్న వైనం..
మంచిర్యాల తెరాస లో బి ఫారం ఇవ్వని సిట్టింగ్ లలో అంతర్మదనం
Kalinga Times, Mancherial :ఆయన గత శాసన సభ ఎలక్షన్లలో తన బాస్ ను గెలిపించుకోవాలని నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఫించన్లకు అర సంవత్సర మో ..నెలలలో తెడా ఉన్నప్పటికి పాపం లబ్దిదారులతో ఎవరికి ఇప్పించేది వారి ఇప్పించి మొత్తానికి వారికి సాయం చేసి తన వార్డులో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో తన వార్డు నుండి ఓట్లు రాబట్టీ బాస్ తో శభాష్ అనిపించుకొన్నాడు.. కాని అదే బాస్ ఇపుడు చేయించించిన సర్వేలో భక్తుడు అవినీతి పరుడుగా మిగిలిపోయాడు..ఫలితం .. ఆ బాసే ఇపుడు.. టికెట్ ఇవ్వటానికి మీన మెషాలు లెక్కిస్తూ..కాలయాపన చేస్తూ టెన్షన్ పెడుతున్నారట..
ఇదే పరిస్తితి అన్ని వార్డులలో బి ఫారం ఇవ్వని అభ్యర్థులలొ నెలకొనడం… నిన్న మొన్న పలు పార్టీలు తిరిగొచ్చిన వారి వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసి తల పట్టుకుంటున్నారు.. అపుడు స్వామి భక్తి కోసం ..పార్టీ ప్రతిష్టకు పోతే.. తమకే గుర్తింపు కరువైందని మదనపడుతున్నారు.