Telangana
సినిమా రంగంలో యానిమేషన్ ట్రెండ్ – మంత్రి కేటీఆర్
Kalinga Times, Hyderabad : యానిమేషన్ రంగంలో పెట్టుబడులు పెడితే ప్రోత్సాహకాలుంటాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని హెచ్ఐసీసీలో ఇండియా జామ్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… ప్రస్తుతం సినిమా రంగంలో యానిమేషన్ ట్రెండ్ నడుస్తోందన్నారు. హైదరాబాద్ లో 25కు పైగా యానిమేషన్, గేమింగ్ స్టార్టప్ కంపెనీలుంటాయన్నారు. వీఎఫ్ ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగంలో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోందన్నారు. వీఎఫ్ ఎక్స్ తలమానికంగా నిలిచే బాహుబలి, ఈగ, మగధీర వంటి చిత్రాలు హైదరాబాద్ లో రూపొందాయన్నారు. తెలుగు చిత్రసీమకు చెందిన నిర్మాతలు ఓటీటీ రంగంలోకి కూడా వెళ్లడం హర్షణీయమన్నారు.