Telangana
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తో హిమాన్షు ఇంటర్వ్యూ
Kalinga Times, Hyderabad : తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌ను.. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయాన్నిహిమాన్షు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. తన స్కూల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి మంత్రిని ఇంటర్వ్యూ చేసినట్లు చెప్పారు. తెలంగాణలో బాలల సంక్షేమంపై చర్చించినట్లు తెలిపారు. మంత్రితో ఇంటర్వ్యూ చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే మంత్రిని ఇంటర్వ్యూ చేసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మంత్రిని ఇంటర్వ్యూ చేసిన హిమాన్షుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.