Telangana

వీసా లేకుండా పాకిస్తాన్లో అడుగుపెట్టిన ప్రశాంత్ అరెస్ట్

Kalinga Times, Hyderabad : పాకిస్తాన్ లో అరెస్టయిన ఇద్దరు భారతీయుల్లో ఒకరు ప్రశాంత్ అనే తెలుగు యువకుడు. ఇతను హైదరాబాదులో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీరు. పాస్ పోర్ట్, వీసా లేకుండా పాకిస్తాన్లో అడుగుపెట్టిన ప్రశాంత్ ను, మధ్యప్రదేశ్ వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో హైదరాబాదులోని ప్రశాంత్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అతన్ని విడిపించడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణా, కేంద్ర ప్రభుత్వాలను వేడుకున్నారు. ఇదిలా ఉండగా ప్రశాంత్ తెలుగులో మాట్లాడిన వీడియో విడుదలైంది. ఇక్కడ అంతా బాగానే ఉంది. పోలీసు స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి జైలుకు పంపిస్తారు. జైలు నుంచి ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇస్తారు. బెయిల్ వస్తే మీతో మాట్లాడవచ్చు. మరో నెల రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది … అని వీడియోలో ప్రశాంత్ చెప్పాడు. ప్రియురాలి కోసం ఇతను పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడని, పొరపాటున సరిహద్దులు దాటి వెళ్లాడని సమాచారం.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close