Telangana
శివశంకర్ సేవలు చిరస్మనీయం
Gavvala Srinivasulu,Kalinga Times ,Secunderabad : రాష్ట్రంలో ఎంతో వెనుకబడి ఉన్న కురుమలు, విద్యార్థులకు ఆశాజ్యోతి మేకల శివశంకర్ అకాల మరణం కురుమ జాతికి తీరని లోటని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, కురుమ రత్న, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం కురుమ అన్నారు. కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ బోర్డు సభ్యుడు మేకల శివశంకర్ హార్ట్ ఎటాక్ తో ఇటీవల మరణించిన సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ మస్లీంజంగ్ బ్రిడ్జ్ వద్ద ఉన్న కురుమ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఎమ్మెల్సీ మల్లేశం పాల్గొని మాట్లాడుతూ శివశంకర్ సేవలు కొనియాడారు. రాష్ట్ర కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. నారాయణ, ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ (శ్రీకాంత్) జంటనగరాల కురుమ సంఘం అధ్యక్షుడు తమగొండ రాజేశ్వర్, నర్సింగ్ వినోద్, తదితర నాయకులు పాల్గొని ప్రసంగిసంగిచారు. అదిక సంఖ్యలో సభ్యులు పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు.