Telangana
బోయిన్ పల్లి సీఐ గా అంజయ్య
Gavvala Srinivasulu,Kalinga Times,Secunderabad : కంటోన్మెంట్ పరిధిలోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా సి. అంజయ్య ఈ రోజు పదవి భాద్యత లు స్వీకరించారు. 1996 బ్యాచ్ కు చెందిన ఆయన ఛత్రినాక, శాలిబండ ,మలక్ పేట పోలీస్ స్టేషన్ లలో ఎస్ఐగా విధులు నిర్వహించగా, అలాగే సీఐ గా అఫ్జల్ గంజ్, శంషాబాద్, లంగర్హౌస్,పోలీసు స్టేషన్ లలో విధులు నిర్వహించిన అంజయ్య బోయిన్ పల్లి పిఎస్ సీఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా , ఎస్ఐలు, సిబ్బంది అందరు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు.