Telangana
అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని రైతుల ధర్న,ఉద్రిక్త పరిస్థితి
Gavvala Srinivasulu ,Kalinga Times,Hyderabad: అరెస్టు చేసిన తమ రైతులను వెంటనే విడుదల చేయాలని, న్యాయపరమైన డిమాండ్ తక్షణం పరిష్కరించాలని కోరుతూ బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రైతులు ఆందోళనలు చేశారు. అధికారులు, పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో మార్కెట్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.ఈ ధర్నా తో ఎక్కడకక్కడ వాహనాలు నిలిచి పోయాయి. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది.
బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్ లో తూకం విషయంలో కమీషన్ ఏజెంట్లు, హమాలీలు చేస్తున్న మోసానికి తాము తీవ్రంగా నష్టపోతున్నామని,గతంలో వంద కిలోల బరువు ఉన్న కూరగాయల బస్తాలను మోసేవారని, ఇపుడేమో 60కిలోల బస్తాలను మాత్రమే మోస్తామని చెప్పడం, 60కిలోల కంటె అధిక బరువు ఉన్న బస్తాలను తూకం చేయకుండా అందులోని కూరగాయలను పడేస్తున్నారని దీంతో నష్ట పోతున్నామని ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా రైతులు భోజిరెడ్డి, అంజిరెడ్డి, మాలిక్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ దేశానికే రైతులు వెన్నుముక లాంటి వార మైన మేము ఎంతో కష్టపడి పండించిన కూరగాయలు ఈ మార్కెట్ తెస్తే తూకం విషయంలో మోస పోతున్నామని వారు తెలిపారు. 80కిలోల బస్తాలను కచ్చితంగా తూకంవేయాలని, లేనిచో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకమమండలీ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున ఈ మార్కెట్ కు తరలి రావడంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు రైతు లనుఎక్కడడికక్కడ అదుపులో తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుమారు రెండు వందల మంది రైతులను అదుపులోకి తీసుకున్నట్లు తెలియడం ఈ వార్త చిలకి చిలికి గాలి వానగా మారడంతో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాలనుంచి వందలాది మంది రైతులు ఇక్కడి కి చేరుకొని ఉన్న రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నార్త్ జోన్ డీసీపీ పరిధిలోని బేగంపేట ఏసీపీ ఏ. రామ్ రెడ్డి, మహాంకళి ఏసీపీ లు వినోద్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ లు, ఎస్ ఐలు సుమారు వందమంది పోలీసుల మధ్య భారీ బందోబస్తు చేశారు. సుమారు ఏడు గంటల పాటు మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఏసీపీ రామ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట కమిటీ అధికారులు ఎంత నచ్చ చెప్పినా రైతులు ధర్నా చేశారు.