Telangana
భారీ వర్ష పాతానికి బోయిన్ పల్లి డివిజన్ అతులాకుతలం
Gavvala Srinivasulu,Kalinga Times,Secunderabad : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని పాత బోయిన్ పల్లి డివిజన్ ప్రాంతాలు అతులాకుతంగా మారి పలు కాలనీలు జలమయం అయ్యాయి. సాయంత్రం కురిసిన భారీ వర్షంతో సాయి సాగర్ ఎన్ క్లాక్, సిండికేట్ బ్యాంకు కాలనీ, మల్లికార్జున కాలనీ, అంజయ్య నగర్, వైశ్య బ్యాంకు కాలనీ, బృందావనం కాలనీ,సమతా నగర్ తదితర కాలనీలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ప్రవాహానికి జనజీవనం స్తంబించింది. సాయి సాగర్ ఎన్ క్లేవ్ పరిస్థితి దారుణంగా మారింది. ఈ కాలనీ వాసుల గోస హరి గోసగా మారింది.అల్వాల్,బొల్లారం, లోతుకుంట, ఇందిరా నగర్ గ్రీన్ ఫీల్డ్, తదితర ప్రాంతాల్లోని నీటి ప్రవాహం సాయి సాగర్ ఎన్ క్లేవ్ గుండా సమీపంలోని హస్మత్ పేట చెవులో చేరుకుంటుంది. అలాగే ఈ కాలనీ గుండా డ్రైనేజీ కాలువ తోడు కావడంతో నీరు ఎక్కడికక్కడ నిలిచి పోవడం వలన మొకాలు లోతు నీరు,వర్షపు నీరు అలాగే ఇండ్లలోకి చేరడంతో స్థానిక ప్రజల బాధలు వర్ణణాతీతంగా పరిణమించాయి. కనీసం ఇంటి బయటికి వెల్లేక పోయారు. సెల్లార్లు ఉన్న అపార్టుమెంట్ లు పూర్తిగా జలమయమైనాయి. అందుకు తోడు విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ఆయా ప్రాంతాల ప్రజలు కదలలేని పరిస్థితి. నీటమునిగిన ఆయా ప్రాంతాల వాసులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ పరిస్థితిల గురించి స్థానిక ఎంఎల్ఏ , కార్పోరేటర్ చెబితే పట్టించు కున్న పాపాన పోలేదని, కనీసం వచ్చి చూసికూడ పలకరించలేదని ఆరోపించారు.