Telangana
నేడు ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్ష సమావేశం
Kalinga Times,Hyderabad : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐదో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పలు సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నాయకులు ఏ మాత్రం తగ్గడం లేదు. కార్మికులు వినూత్న నిరసనలు తెలుపుతున్నారు. సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్టీసీ సమ్మెపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అధ్యక్షతన అన్ని పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించాయి. నేడు భవిష్యత్ కార్యాచరణను ఆర్టీసీ జేఏసీ ప్రకటించనుంది. 26 డిమాండ్లతో పాటు విలీనంపై కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.రౌండ్ టేబల్ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు హాజరుకానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు. అఖిలపక్ష సమావేశానికి ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రజా, విద్యార్థి సంఘాలు హాజరుకానున్నాయి