Telangana

విన్నూత్నంగా సమస్యల నమోదు కార్య క్రమాన్ని చేపట్టిన జి.శ్రవణ్ కుమార్

Reporter Mahender Kalinga Times, Secudarabad: సాధారణంగా రాజకీయ పార్టీలన్ని తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ సభ్యత్వ నమోద కార్యక్రమాన్ని చేపడతాయి. సమస్యల నమోదు చేసుకొవడమంటే తేనతుట్టెను కదపడమే అని భావిస్తాయి .కాని నవతరం నాయకుడు జి శ్రవణ్ కుమార్ మాత్రం కంటొన్మెంట్ 4వ వార్డులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లక్ష్మి నగర్ ప్రాంతంలో పర్యటించారు. వారి ఇబ్బందులను గమనించి వారి బస్తీలో గాంధి జయంతి సంధర్భంగ సరికొత్త కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు.అదే సమస్యల నమోదు కార్యక్రం. దీనికి లక్ష్మినగర్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకు గెలిచిన నాయకులు,ప్రతిపక్ష నాయకులు కాని తమ దగ్గరకు రాలేదని విమర్శించారు.అలాంటిది గత ఆరు నెలల నుండి తమకోసం శ్రవణ్ కుమార్ ఇప్పటికే బస్తీలో రెండు మూడు సార్లు పర్యటించి తమ బాగోగులు తెలుసుకుంటున్నారని కొనియాడారు.అనంతరం శ్రవణ్ మాట్లాడుతూ నేని ఈ ప్రంత నివాసినే ఇక్కడ గత 50 సంవత్సరాలనుండి చెప్పుకోదగ్గ అభివృద్ది జరగలేదు. నాలా వల్ల అనేక రోగాలు ప్రబలుతున్నాయి. మరో విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు లేవని ఈ సమస్యల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సంబదిత బోర్డ్ అధికారులకు రిప్రజెంటెషన్ ఇచ్చి కొంత సమయం వేచి చూస్తాను. వారు స్పందించక పోతే బస్తీ వాసులతో కలసి ధర్నా మరియు ఇతర కార్యక్రమాలతో సంస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close