Telangana
ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల కేసీఆర్ చిరు కానుక
Kalinga Times,Nalgonda : రాష్ట్రంలోని కోటిమంది ఆడబిడ్డలకు కేసీఆర్ తోబుట్టువని, బతుకమ్మ పండుగ సందర్బంగా ఆయన ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల రూపంలో చిరు కానుక అందిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆయన నల్గొండలోని జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు నేతన్నలు చక్కటి చీరలు తయారు చేస్తున్నారని, ఈ ఏడాది కూడా కష్టపడి మంచి చీరలు అందించారని కేటీఆర్ మెచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోచంపల్లిలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని, అది చూసి చలించిన కేసీఆర్ వారికి ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. బతుకమ్మ చీర తయారీయే కాకుండా బడి పిల్లల యూనిఫారాలు రూపొందించే బాధ్యత కూడా నేతన్నలకు ప్రభుత్వం అప్పగించిందన్నారు.