Telangana

ఓల్డ్ బోయిన్ పల్లి లో చాల ప్రాంతాలలో దోమల బాద,కంపు వాసనలు

Gavvala Srinivasulu,Kalinga Times : కూకట్ పల్లి నియోజక వర్గం పరిధిలోని ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ గల చాల ప్రాంతాలలో పేరుకు పోయిన చెత్తకుప్పలు,వర్షాలకు ఎక్కడికక్కడ నిలిచి పోయిన నీరు,ఏర్పడి గుంతలు తదితర సమస్యలతో సమస్యల నిలయంగా మారిపోయింది. భవానీ నగర్,గంగం పుత్రసంఘం,ఎల్.బి.నగర్,మల్లికార్జన నగర్,సమతా నగర్ గోరె కాలనీ,హస్మత్ పేట,అంజయ్య నగర్ తదితర ప్రాంతాలలో స్థానిక ప్రజలు ఆయా సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. దీని తోడు దోమల బాద,కంపు వాసనలు, ఈ మధ్య చోటుచేసుకుంటున్న మలేరియా,డెంగ్యూ,విషజ్వరాలతో ప్రజలు సతమవుతున్నారని స్థానికులు భయబ్రాంతులకు గరవుతున్నారని పలువురు మీడీయాకు తేలిపారు.

ఆయా సమస్యలగురించి స్థానిక కార్పోరేటర్ ముద్దం నర్శింహా యాదవ్ కు ఫర్యాదులు చేసిన ఫలితంలేకుండా పోయిందని వాపోతున్నారు.అధికారులు అసలే పట్టించుకోరన్నారు. ఇదిఇలా ఉంటే మల్లికార్జున నగర్ రోడ్డు నంబర్ 3లో మరీ ఘోరంమని స్థానిక మహిళలు శ్రీమతి దేవిక రాణి,దివ్వ,విజయ లక్ష్మీ తెలిపారు. ఈ రోడ్డులో ఉన్న శ్రీ సాయి ప్రజ్ఞ ప్లే స్కూల్ చిన్నారులు విద్యార్థులు‌,వారి తల్లిదండ్రల బాధలు వర్ణణాతీతంగా పరిణమించాయని చెప్పారు.పిల్లలను స్కూల్ పంపాలన్ని వారి తల్లిదండ్రులు జంకుతున్నారు. ఏ సమయంలో ఏమిజరుగుతుందోనని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన కార్పోరేటర్ ముద్దం నర్శింహా యాదవ్,సంబందిత అధికారులు మేలుకొని యుద్దప్రాథికపై సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుచున్నారు.లేని పక్షంలో ఏ సంఘటనలు చోటుచేసుకున్న కార్పోరేటర్ భాద్యతవహించాల్సివస్తుందని కూడా ప్రజలు అంటున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close