Telangana
పోగొట్టుకొన్న సెల్ ఫోన్ లు భాదితులకు అప్పగింత
Gavvala Srinivasulu, Kalinga Times,Secudrabad : సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలోని కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకొన్న సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సబంధిత భాదితులకు అప్పగించారు. ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్ఖాన ఎస్ఐ ఎన్. సందీప్ రెడ్డి సంబంధిత ఘటన గురించి వివరిస్తూ కార్ఖాన పీఎస్ పరిధిలో కొంత మంది తమ విలువైన స్మార్ట్ ఫోన్ లను పోగొట్టుకొన్న సందర్భంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్నాలజీతో పరిశీలించి విచారించగా ఒక లక్ష ఎనభైవేల విలువగల స్మార్ట్ ఫోన్లలను స్వాధీనం చేసుకుని అప్పగిస్తున్నామని తెలియజేశారు. నార్త్ జోన్ ఏసీపీ మహాంకాళి డివిజన్ వినోద్ కుమార్ సమక్షంలో సీఐ పి. మధుకర్ స్వామి, డిటెక్టీవ్ సీఐ.. సిహెచ్. నెత్తి, మరో ఎస్ఐ. రవిపాల్ క్రైమ్ బృందం టెక్నాలజీ ఉపయోగించి మొత్తం 11ఫోన్లను స్వాధీనం చేసుకుని సబంధిత బాదితులకు అప్పగిస్తున్నామని సందీప్ రెడ్డి తెలిపారు.