social
కొమురవెళ్ళిలో పికాక్ ఎస్టేట్ సంస్థ వారి భగీరథ హాలీడే వెంచర్ ప్రారంభం
Kalinga Times,Hyderabad :రియల్ ఎస్టేట్లో పేరెన్నిక గల పికాక్ ఎస్టేట్ సంస్థ ఇపుడు సిద్దిపేట జిల్లాలోనే కొమురవెళ్ళిలో ఆధునిక హంగులతో సరికొత్తగా భగీరథ హాలీడే వెంచర్ బ్రోచర్ ను సోమవారం అంతర్జాతీయ సౌత్ ఇండియా డైరెక్టర్ మరియు సీనియర్ హై కోర్ట్ అడ్వకేట్ డాక్టర్ ఎ.వి.స్వామి ప్రారంభించారు. సంస్థ డైరెక్టర్ సంగమేశ్వర్ రావు వెంచర్ బ్రోచర్ ఆవిష్కరణ అనతరం మాట్లాడుతూ 1997 సంవత్సరంలో తమ సంస్థ మొదటి వెంచర్ ను సిద్దిపేటలో ప్రారంభించడం జరిగిందన్నారు.గృహ వినియోగదారులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనతి కాలంలోనే పికాక్ రియల్ ఎస్టేట్ విశ్వసనీయత గల సంస్థగా గుర్తింపును ప్రజలలో సాధించుకొన్నమని తెలిపారు. మా సంస్థలో వెయ్యి మందికి పైగా గృహ వినియోగదారులు ఉన్నారని వారందించిన ప్రొద్భలంతోనే ఇపుడు అత్యంత ఆధునిక టెక్నాలజీతో కొమురవెళ్ళిలో భగీరథ హాలీడే వెంచర్ ను రూపొందించామని పేర్కొన్నారు.కస్ట మర్ల అభిరుచికి అనుగుణంగా సకల సదుపాయలతో భగిరథ హాలీడే వెంచర్ ప్రాజెక్ట్ ను పికాక్ ఎస్టేట్ చేపట్టడం జరిగిందన్నారు .